Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా చిత్రం “పెద్ది”తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా సాగుతూ ఉండటం విశేషం. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 2026 మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ మాస్, క్లాస్ రెండు యాంగిల్‌లను కలిపి చూపించబోతున్నారట.
Ram Charan Movie Updates
ఇక ఈ సినిమా తర్వాత చరణ్ (Ram Charan) తదుపరి సినిమా ఏంటి అనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే సుకుమార్‌తో “రంగస్థలం” తర్వాత మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని సమాచారం. అయితే ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది – బాలీవుడ్ “కిల్” ఫేమ్ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్.
కొన్నేళ్ల క్రితం నిఖిల్ భట్‌తో చరణ్ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి కానీ ఆ సమయంలో వాటిని ఖండించారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బాలీవుడ్‌లో జంజీర్‌తో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన చరణ్, ఇప్పుడు నిఖిల్ భట్ దర్శకత్వంలో మరో హిందీ సినిమాకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇది జరగితే, జంజీర్ తర్వాత బాలీవుడ్‌లో చరణ్ రెండో సినిమా అవుతుంది.
అయితే సుకుమార్ సినిమా ముందు ఆర్.సి-నిఖిల్ ప్రాజెక్ట్ వస్తుందా, తర్వాత వస్తుందా అన్నది మాత్రం అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్ స్క్రిప్ట్‌లు వింటూ, సరైన ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పే పనిలో ఉన్నారు. మరి ఈ నూతన కాంబినేషన్లు ఆయన కెరీర్‌కి కొత్త మలుపు తిప్పుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : Hero Vishnu-Kannappa : మంచు విష్ణు కన్నప్ప సినిమాపై తలైవా ప్రశంసలు
