Hero Sivakarthikeyan : ఇచ్చిన మాటకు కట్టుబడి గుట్టుగా సాయం చేస్తున్న హీరో

ఈ అంశాన్ని తాజాగా దర్శకుడు ఐ. శరవణన్‌ బయటపెట్టారు.

Hello Telugu - Hero Sivakarthikeyan

Hello Telugu - Hero Sivakarthikeyan

Sivakarthikeyan : శివ కార్తికేయన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ డాక్టర్, అమరణ్ వంటి చిత్రాలతో ఇప్పటికే తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకొని, స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. కానీ, హీరోగా ఎంత ఎదిగినా తన మూలాలను మరవకుండా, నెరపిన వాగ్దానాలను పాటిస్తూ, తాను ఏమిటన్నదాన్ని తన ఆచరణతో నిరూపిస్తూ, అభిమానులకు, సహనటులకు, సమాజానికే ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు.

Hero Sivakarthikeyan Helps

ఇటీవల ఈ విషయం వెలుగులోకి వచ్చింది – ఆయన ఒకప్పుడు మరణించిన తమిళ రైతు నాయకుడికి ఇచ్చిన మాటను ఈటువంటి ప్రచారం లేకుండా ఇప్పటికీ నెరవేరుస్తున్నారన్నది తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అంశాన్ని తాజాగా దర్శకుడు ఐ. శరవణన్‌ బయటపెట్టారు.

ఆయన మాట్లాడుతూ – ‘‘నా సోదరుడు నెల్ జయరామన్ మరణించినప్పుడు, ఆయన కుమారుడు శ్రీనివాసన్‌ విద్యాభ్యాసాన్ని నేను చూసుకుంటానని శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హామీ ఇచ్చారు. ఆ మాట ఇచ్చినప్పటి నుంచీ గత ఏడు సంవత్సరాలుగా ఆయన మాట నిలబెట్టుకుంటూ విద్యా ఖర్చులన్నీ భరిస్తున్నారు’’ అని తెలిపారు.

అంతేకాకుండా, ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో వ్యక్తిగతంగా ఫోన్ చేసి, చదువు ఎలా సాగుతోంది, ఏం అవసరమవుతోంది వంటి విషయాలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం శ్రీనివాసన్‌ కోయంబత్తూరులోని కర్పగం కాలేజీలో చదువుతున్నాడు. ఈ విషయాన్ని చర్చిస్తూ శరవణన్‌ చెప్పినట్లు – ‘‘ఇలాంటి మాట నిలబెట్టుకోవడం చాలా అరుదు. అలాంటి అరుదైన గుణం ఉన్నవారిలో శివ కార్తికేయన్‌ ఒకరు’’ అని ప్రశంసలు కురిపించారు.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, శివ కార్తికేయన్‌ ఎలాంటి ప్రచార ఉద్దేశం లేకుండా చేసిన ఈ సహాయం గురించి తెలిసిన నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘రివీల్‌ లైఫ్‌లో మాత్రమే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ నిజమైన హీరో శివ కార్తికేయన్‌’’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో సహాయాలు ఆయన చేస్తున్నారు కానీ తెలిసేలా చేయట్లేదు కాబట్టి, నిజంగా ఆయన్ను అభిమానించడం గర్వంగా ఉంది అంటూ ఫ్యాన్స్ హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు.

Also Read : Popular Actor Nagarjuna : అలాంటి సినిమా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి

Exit mobile version