Ram Charan : తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ) చైర్మన్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. మెగా ఫ్యామిలీకి చెందిన నటుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా దిల్ రాజు రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే..ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బొక్క బోర్లా పడింది. చెర్రీ ఉన్నా ఆ సినిమాను కాపాడలేక పోయింది.
Hero Ram Charan Fans Serious
విడుదలైన తొలి రోజే నెగటివ్ టాక్ వచ్చింది. దేశంలో పేరు పొందిన దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. తన పేరు, మెగా హీరో ఇమేజ్ ఏ మాత్రం కాపాడలేక పోయింది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాగుందంటూ కితాబు ఇచ్చినా గేమ్ ఛేంజర్ ను ఆదుకోలేక పోయింది. ఈ సందర్బంగా తాము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఏకరువు పెట్టారు చిట్ చాట్ సందర్బంగా నిర్మాత శిరీష్ రెడ్డి. తను ప్రముఖ పంపిణీ దారుడు కూడా.
సినిమా ఫెయిల్ అయినా నటించిన రామ్ చరణ్ కానీ దర్శకత్వం వహించిన శంకర్ కానీ ఇప్పటి వరకు స్పందించ లేదంటూ వాపోయడు. సినిమా సక్సెస్ అయితే తమ వల్లనే అయ్యిందంటూ గొప్పలు చెప్పుకుంటారని, కానీ లాస్ అయితే మాత్రం బయటకు రారంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై రామ్ చరణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గేమ్ ఛేంజర్ తమను రోడ్డు పాలు చేస్తే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ. 300 కోట్లు సాధించిందని, లేక పోతే తీవ్ర ఇబ్బందులు పడే వాళ్లమన్నారు. చివరకు సారీ చెప్పాడు శిరీష్ రెడ్డి.
Also Read : Hero Dhanush – Kriti Sanon : ధనుష్ తో తెర పంచుకోవడం అద్భుతం
