Hero Vishnu – Kannappa :క‌న్న‌ప్ప మూవీ కోసం రేయింబ‌వళ్లు శ్ర‌మించాం

స్ప‌ష్టం చేసిన న‌టుడు మంచు విష్ణు

Hello Telugu - Hero Vishnu - Kannappa

Hello Telugu - Hero Vishnu - Kannappa

Kannappa : మంచు మోహ‌న్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో భారీ ఖ‌ర్చుతో నిర్మించిన చిత్రం క‌న్న‌ప్ప‌. ఏకంగా రూ . 200 కోట్లకు పైగా ఖ‌ర్చు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు. అమెరికాలో ముంద‌స్తు టికెట్ల‌ను అమ్మారు. భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో ఫుల్ సంతోషంలో ఉన్నారు తండ్రీ కొడుకులు మంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణు. మాలీవుడ్ స్టార్ హీరో మోహ‌న్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు అక్ష‌య్ కుమార్, కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అద్భుత‌మైన స్క్రిప్ట్ తో ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్, పోస్ట‌ర్స్, ట్రైల‌ర్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

Manchu Vishnu Comment about Kannappa Struggles

జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా క‌న్న‌ప్ప (Kannappa) గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చిట్ చాట్ సంద‌ర్బంగా మంచు విష్ణు మాట్లాడారు. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట ప‌డ్డాన‌ని, ఈ చిత్రం ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ టాక్ వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. భారీ ఎత్తున ఖ‌ర్చు చేసిన‌ట్లు చెప్పాడు.

భార‌తీయ ఇతిహాసం ఆధారంగా క‌న్న‌ప్ప‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని అన్నాడు న‌టుడు మంచు విష్ణు. త‌ను కీల‌క పాత్ర పోషించాడు. భ‌క్తి, విశ్వాసం కోసం ప్ర‌తిదీ వ‌దులుకునే ముడి ధైర్యం, ఈ ఇతివృత్తాలు కాలాతీతంగా అనిపిస్తాయ‌ని పేర్కొన్నాడు. అయిన‌ప్ప‌టికీ త‌ర‌చుగా విశ్వాసాన్ని తేలిక‌గా తీసుకునే యుగంలో అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశాడు మంచు విష్ణు. ఇదిలా ఉండ‌గా క‌న్న‌ప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు.

Also Read : Today Gold Price : మరోసారి కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

Exit mobile version