Nagababu : హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ ఆరోగ్యం బాగో లేదంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు జనసేన పార్టీ ఎమ్మెల్సీ , నటుడు నాగబాబు కొణిదల. మంగళవారం ఆయన తన అధికారిక ఎక్స్ వేదికగా అంజనమ్మ హెల్త్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమె ఇంట్లో హాయిగా పిల్లలతో ఆడుకుంటోందని తెలిపారు. ఎవరో కావాలని ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Nagababu Mother Health Updates
ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకుని రాస్తే మంచిదని హితవు పలికారు నాగబాబు కొణిదల (Nagababu). తను సూపర్ గా ఉందని , ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అంజనమ్మ ఆరోగ్యం బాగో లేదని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సైతం కీలక మీటింగ్ నుంచి తిరిగి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చారని , ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను తెగ షేర్ చేశారు.
దీంతో అంజనమ్మ అనారోగ్యంపై ఆందోళన నెలకొనడం, మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఆరా తీయడంతో గత్యంతరం లేక నాగబాబు స్పందించారు. ఇది పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. తమ తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. మెగా అభిమానుల ప్రేమాభిమానాలు ఉన్నంత వరకు ఆమెకు ఏమీ కాదని స్పష్టం చేశారు నటుడు, ఎమ్మెల్సీ.
Also Read : Beauty Anushka Shetty : సూపర్ హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్న స్వీటీ
