Kannappa : హైదరాబాద్ – మంచు మోహన్ బాబు సమర్పణలో మంచు విష్ణు కీ రోల్ పోషించిన చిత్రం కన్నప్ప. ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే మంచి ఆదరణ లభించింది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. తొలి రోజు ఏకంగా రూ. 13 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిని ఏకంగా మోహన్ బాబు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసి కన్నప్పను (Kannappa) రూపొందించారు.
Kannappa Success Mohan Babu Comments
ఈ సందర్బంగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. చిత్ర విజయంలో ప్రేక్షకులు కీలక పాత్ర పోషించారంటూ పేర్కొన్నారు మోహన్ బాబు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. అంతే కాకుండా మీడియాకు థ్యాంక్స్ తెలిపారు. శివుని ఆశీస్సులతో కన్నప్ప చిత్రం సక్సెస్ అయ్యిందన్నారు మోహన్ బాబు. ఒకే సినిమా కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేశామన్నారు. తాను నటుడిగా ప్రయాణాన్ని ప్రారంభించి 50 ఏళ్లు అయ్యిందన్నారు.
ప్రతి దశలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ మరిచి పోలేనన్నారు. వినయ్ లేక పోతే కన్నప్ప ఉండేవాడు కాదన్నారు. మంచు విష్ణు మాట్లాడారు. ఈ సినిమా విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపామన్నారు. ఈ సక్సెస్ పూర్తిగా ప్రేక్షకులదేనని పేర్కొన్నారు.
Also Read : KTR Shocking Comments : రేవంత్ ను పావుగా వాడుకుంటున్న కేంద్రం
