Popular Actor Mammootty : మమ్ముట్టి ఆరోగ్యం పై వస్తున్న రూమర్స్ ని ఖండించిన ఎంపీ జాన్

అయితే ఈ ప్రచారాన్ని మమ్ముట్టి బృందం ఖండించింది...

Hello Telugu - Popular Actor Mammootty

Hello Telugu - Popular Actor Mammootty

Mammootty : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియా మరియు పలు వార్తా ఛానళ్లలో వేగంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలు చూసిన అభిమానులు బాగా ఆందోళన చెందారు. అయితే ఈ ప్రచారాన్ని మమ్ముట్టి (Mammootty) బృందం ఖండించింది.

Mammootty Health Updates

‘‘మమ్ముట్టి గారికి సంబంధించి ఆరోగ్య సమస్యల గురించి ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. రంజాన్ సందర్భంగా ఆయన కొన్ని రోజుల పాటు షూటింగ్‌ నుంచి విరామం తీసుకుని విహారయాత్రకు వెళ్లారు. త్వరలోనే ఆయన తిరిగి వచ్చి మోహన్‌లాల్‌తో కలిసి మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పాల్గొనబోతున్నారు,’’ అని మమ్ముట్టి టీమ్ స్పష్టం చేసింది.

ఇక ఈ విషయంలో మమ్ముట్టి సన్నిహితుడు, ప్రముఖ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ కూడా స్పందించారు. ‘‘మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు కావు. కానీ ఆయనకు ఉన్నది కేవలం స్వల్పమైన ఆరోగ్య సమస్య మాత్రమే. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. నేను కొన్ని గంటల క్రితమే ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు,’’ అని తెలిపారు.

ఇక మమ్ముట్టి ఆరోగ్య కోరికతో ఆయన సహచర నటుడు మోహన్‌లాల్ శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘‘అలాంటి చిన్నచిన్న సమస్యలు అందరికీ వస్తుంటాయి. అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి త్వరగా కోలుకుంటారు,’’ అని మోహన్‌లాల్ చెప్పాడు.

ఈ వ్యాఖ్యలతో మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు ముగింపు పలకబడింది. ఆయన అభిమానులు ఇప్పుడు కొంత ఊపిరిపీల్చుకున్నప్పటికీ, మమ్ముట్టిని త్వరగా తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Hero Chiranjeevi- Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాకు భీమ్స్ సిసిరోలియో బాణీలు

Exit mobile version