Show Time : టాలీవుడ్ లో భిన్నమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra). తను పలికించే భావాలు భిన్నంగా ఉంటాయి. తాజాగా తాను ముఖ్య పాత్ర పోషించిన చిత్రం షో టైం. మూవీ మేకర్స్ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు మదన్ దక్షిణమూర్తి దర్శకత్వం వహించగా గరికపాటి కిషోర్ నిర్మించారు. ఇందులో కీ రోల్ పోషించింది కామాక్షి భాస్కర్ల.
Naveen Chandra Show Time Movie Updates
ప్రధానంగా ఈ చిత్రం ఒకే పాయింట్ మీద ఆధారపడి తీశాడు దర్శకుడు. ఓ హత్య చుట్టూ అల్లుకున్న సంఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కించాడు. ఆద్యంతం ఆసక్తిని రేపేలా ఉంది ట్రైలర్. వీటితో పాటు ఇందులో కోర్టు గది సన్నివేశాలతో పాటు పోలీసులు విచారణ సన్నివేశాలు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.
ట్రైలర్ ను రిలీజ్ చేసిన అనంతరం దర్శకుడు గరికపాటి కిషోర్ మీడియాతో మాట్లాడాడు. క్రైమ్ మిస్టరీ నేపథ్యంలో సాగే వినూత్నమైన కథ ఇదని పేర్కొన్నాడు. తన కెరీర్ లోనే ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలిచి పోతుందన్నాడు. కాగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చిత్రం తప్పకుండా ఆకట్టుకోవడం ఖాయమని పేర్కొన్నాడు నటుడు నవీన్ చంద్ర. స్కైలైన్ మూవీస్ పతాకంపై అనిల్ సుంకర సమర్పించారు షో టైమ్ ను.
Also Read : Hero Allari Naresh :సెకండ్ ఇన్నింగ్స్ తో అల్లరోడు సక్సెస్
