Hero Nithin – Tammudu Movie :త‌మ్ముడు మామూలోడు కాదు

బ‌గ‌లాముఖి సాంగ్ విడుద‌ల

Hello Telugu - Hero Nithin - Tammudu Movie

Hello Telugu - Hero Nithin - Tammudu Movie

Tammudu : ప్ర‌ముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం త‌మ్ముడు. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు నితిన్ రెడ్డి. ఈ ఏడాది త‌న‌కు బిగ్ షాక్ ఇచ్చింది. త‌ను న‌టించిన రాబిన్ హుడ్ ఆశించిన మేర ఆడ‌లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇందులో కీ రోల్ పోషించింది ల‌వ్లీ గ‌ర్ల్ శ్రీ‌లీల‌. జీవీ ప్ర‌కాష్ కుమార్ అద్భుత‌మైన సంగీతం అందించినా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో తీవ్ర నిరాశ‌కు లోన‌య్యాడు నితిన్ రెడ్డి (Nithin). ఈ సినిమాలో స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ కీ రోల్ పోషించినా ఆద‌రించ‌లేదు. ఇదిగో స‌ర్ ప్రైజ్ అంటూ స్పెష‌ల్ సాంగ్ కాంట్రోవ‌ర్సీకి దారి తీసినా సినిమాను గ‌ట్టెక్కించ లేక పోయింది.

Tammudu Movie Updates

ఇది ప‌క్క‌న పెడితే నితిన్ రెడ్డి నుంచి మ‌రో మూవీ వ‌స్తోంది. దీనిపై పెద్ద ఎత్తున న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. టైటిల్ చూసిన వారంతా పూర్తిగా ఫ్యామిలీ ప‌రంగా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ ఇటీవ‌లే రిలీజ్ చేసిన గ్లింప్స్ కాంతారాను దాటేసేలా ఉంద‌ని తేలి పోయింది. ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ఆ మూవీ కంటే బాగా కంటెంట్ ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌మ్ముడు సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. జై బ‌ల‌గాముఖి అనే పాట‌ను రిలీజ్ చేశారు. అజ‌నీష్ లోక‌నాథ్ మ్యూజిక్ అందించాడు. జొన్న‌విత్తుల దీనిని రాశాడు. వి. అబ్బి అద్భుతంగా పాడాడు. తెలంగాణ‌లో బోనాల‌కు పెద్ద ఎత్తున ప్ర‌యారిటీ ఉంటుంది. ఈ సంద‌ర్భంగా గ్రామ దేవ‌త‌ల‌కు బోనాలు స‌మ‌ర్పించే స‌మ‌యంలో పాట రానుంది. పాట‌కు ప్రాణం పోశాడు గేయ ర‌చ‌యిత‌.

Also Read : Rajinikanth Coolie Sensational : సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న త‌లైవా కూలీ

Exit mobile version