Hero Nithin Reddy – Tammudu Movie : నితిన్ రెడ్డి ట్రైల‌ర్ మూవీ రిలీజ్

బాగుందంటూ భారీగా స్పంద‌న

Hello Telugu - Hero Nithin Reddy - Tammudu Movie

Hello Telugu - Hero Nithin Reddy - Tammudu Movie

Nithin Reddy : నితిన్ రెడ్డి కీ రోల్ పోషించిన చిత్రం త‌మ్ముడు. ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. దృశ్య ప‌రంగా అద్భుతంగా ఉందంటూ చూసిన వారంటున్నారు. భావోద్వేగాల‌ను ప‌లికించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్. సోద‌రి ఝాన్సీ చుట్టూ క‌థ‌ను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణు. ఇటు డైరెక్ట‌ర్ కి అటు న‌టుడు నితిన్ రెడ్డికి (Nithin Reddy) ఈ మూవీ అత్యంత ముఖ్యం.

Hero Nithin Reddy Tammudu Movie Trailer Updates

త‌న‌కు ఇచ్చిన పాత్ర‌లో లీన‌మై పోయాడు న‌టుడు. సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఉత్కంఠ భరితమైన విజువల్స్‌ను రూపొందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇందుకు త‌న‌ను అభినందించి తీరాల్సిందే. ఈ సినిమాకు మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యానిమ‌ల్ మూవీలో న‌టించి పేరు పొందిన సౌర‌భ్ స‌చ్ దేవ్ ఇందులో విల‌న్ గా న‌టించాడు. త‌ను పూర్తి న్యాయం చేశాడు.

మహిళా ప్రధాన పాత్రలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక కూడా శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలతో తమదైన‌ ముద్ర వేశారు, కథలో వారికి ముఖ్యమైన పాత్రలు ఉన్నాయని సూచిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ త‌మ్ముడు చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనిపై భారీ పెట్టుబ‌డి పెట్టాడు దిల్ రాజు. మొత్తంగా సినిమా పూర్తిగా భావోద్వేగాలను ప్ర‌తిఫ‌లించేలా ఉంది ఈ చిత్రం.

Also Read : PM Kisan Interesting Update : రైతన్నలకు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు జమ అయ్యేది అప్పుడే..

Exit mobile version