Samantha : అక్కినేని నాగ చైతన్య- సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా ఏ మాయ చేసావే. 2010 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో 15 ఏళ్ల తరువాత మళ్లీ ఈ సినిమాను జూలై 18 న రీరిలీజ్ చేస్తున్నారు. ఇక ఏ మాయ చేసావే సినిమా చై – సామ్ (Samantha) కు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమించుకున్నారు. అనంతరం ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
Samantha Rejects
చై (Naga Chaitanya) సంగతి పక్కన పెడితే.. సామ్ (Samantha) కు ఈ చిత్రం ఒక మధుర జ్ఞాపకం. చై తో ప్రేమలో పడేసిందనో.. లేక టాలీవుడ్ ఇండస్ట్రీకి జెస్సీని పరిచయం చేసిందనో తెలియదు కానీ.. ఆమె తన ఒంటిపై ఈ సినిమా పేరును టాటూగా వేయించుకుంది. ఇక అంతేనా ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రతి సంఘటనను తన పెళ్లి చీరలో ముద్రించుకుంది. అయితే రెండేళ్ల క్రితం చై – సామ్ విడిపోయాక సామ్ తో పాటు అభిమానులకు కూడా అవే జ్ఞాపకాలు మిగిలిపోయాయి. మ్యూచువల్ గా విడిపోయినా తామెప్పుడూ స్నేహితుల్లానే ఉంటామని చెప్పిన చై – సామ్ ఇప్పటివరకు ఒక్క స్టేజిపైన కూడా కలిసి కనిపించలేదు.
ఇక వారి మొదటి సినిమా రీరిలీజ్ కానుంది అంటే.. ప్రమోషన్స్ లోనైనా మళ్లీ కనిపిస్తారేమో అని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆ ఆశలను కూడా సామ్ అడియాశలు చేసింది. నాగ చైతన్యను కలవడం ఇష్టం లేకనో.. వేరే కారణమో తెలియదు కానీ.. ఏ మాయ చేసావే ప్రమోషన్స్ కు ఆమె రావడం లేదని క్లారిటీ ఇచ్చింది. ” నేను ఎలాంటి సినిమా ప్రమోషన్స్ కు రావడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరు సృష్టిస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రమోషన్స్ కు నేను దూరంగా ఉంటున్నాను. తమ అభిమాన నటులను కలవాలని, మళ్లీ తిరిగి చూడాలని అభిమానులకు ఉండొచ్చు. అయితే ప్రేక్షకులు అనుకున్నట్లే అన్ని జరగవు. వారి దృష్టి కోణంలో ఒకరి జీవితం ఆధారపడి ఉండదు.
ఏ మాయ చేసావే నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. కెరీర్ మొదట్లోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి డైరెక్టర్ తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఏ మాయ చేసావే సినిమా షూట్ మొదటి నుంచి చివరి వరకు నాకు అన్ని గుర్తు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వవర్ధ తెలియడంతో నెటిజన్స్ కొద్దిగా నిరాశకు గురయ్యారు. నాగచైతన్యను కలిసేది లేదు అని ఆమె డైరెక్ట్ గా చెప్పకుండా ఇలా ప్రమోషన్స్ కు రాను అని చెప్తుంది అంతేగా అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : Hero Havish -Trinadha Rao Nakkina : యంగ్ హీరో ‘హవీష్’ కాంబోలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
