Beauty Rakul Preet Singh : రామాయణ సినిమాలో రకుల్ డి శూర్పణఖ పాత్రా..?

ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్న రకుల్..

Hello Telugu - Beauty Rakul Preet Singh

Hello Telugu - Beauty Rakul Preet Singh

Rakul Preet Singh : తనకోసం ప్రత్యేకంగా వెతికేసి వచ్చిన ఓ పవర్‌ఫుల్ రాక్షస పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్న రకుల్, ఇప్పుడు దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమైన ‘రామాయణ’ లో కీలక పాత్ర పోషించబోతున్నారు.

Rakul Preet Singh in Ramayana Cinema

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించనుండగా… రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) శూర్పణఖ పాత్రలో దర్శనమివ్వనున్నారు. రాముడిని పెళ్లాడాలని ఆశించి, తిరస్కరణ ఎదుర్కొని, ప్రతీకారంగా వ్యవహరించే శూర్పణఖ పాత్ర సినిమాలో కీలక మలుపు తీసుకురావనుంది.

ఈ పాత్రకు ఓ స్టారే అయినా సరే, రాక్షస పాత్ర కావడం వల్ల కొంతమంది హారితంగా ఫీల్ అయ్యే అవకాశం ఉండగా… రకుల్ మాత్రం పాత్రలో బలమూ, సినిమా స్కేల్‌ కూడా చూసుకుని వెంటనే ఒప్పేసుకున్నారు. నితీష్ తివారీ దృష్టిలో శూర్పణఖ పాత్రకు రకుల్ తగిన ఎంపిక అనిపించిందట.

తొందరలోనే ఈ సినిమాకు సంబంధించి ఆమె షూటింగ్‌లో పాల్గొననుండగా, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినా బాలీవుడ్ మీడియా ఈ వార్తను ధృవీకరిస్తోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఈ నిర్ణయంతో నెటిజన్లను ఆకట్టుకుంటూ, “నటిగా కొత్త మలుపు తిరిగే ఛాన్స్ ఆమెకు వచ్చింది” అనే ప్రశంసలు తెచ్చుకుంటున్నారు.

Also Read : Hero Ram Charan : ఎట్టకేలకు 12 ఏళ్లకు బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న గ్లోబల్ స్టార్

Exit mobile version