Hero Vishnu – Kannappa : క‌న్న‌ప్ప మా సినిమా కాదు మీ సినిమా

మంచు విష్ణు తీవ్ర భావోద్వేగంతో ట్వీట్

hellotelugu-kannappamovie

Kannappa : మంచు మోహ‌న్ బాబు భారీ నిర్మాణంతో పాటు స‌మ‌ర్పించిన చిత్రం క‌న్న‌ప్ప. ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి షో నుంచే భారీ స్పంద‌న రావ‌డంతో మూవీ టీం ఫుల్ ఖుష్ లో ఉంది. ఈ సంద‌ర్బంగా న‌టుడు మంచు విష్ణు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు. పూర్తిగా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. ఈ క్ష‌ణం కోసం జీవితమంతా ఎదురు చూశాన‌ని అన్నాడు. ఓవర్సీస్ ప్రీమియర్లు, ఉదయం షోల నుంచి వస్తున్న స్పందనపై సంతోషంగా ఉందంటూ పేర్కొన్నాడు.

Manchu Vishnu – Kannappa

క‌న్న‌ప్ప (Kannappa) త‌మ సినిమా కాదు, ఇక‌పై ఇది మీ అంద‌రి సినిమా అంటూ స్ప‌ష్టం చేశాడు. ఇందులో భారీ తారాగ‌ణం న‌టించింది. ద‌ర్శ‌కత్వ ప్ర‌తిభ తెర‌పై ఆవిష్క‌రించింది. క‌న్న‌ప్ప చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో రిలీజ్ చేశారు. భారీ ఎత్తున బ‌జ్ రావ‌డం ప‌ట్ల ఆనందంగా ఉంద‌న్నాడు. చాలా కాలంగా క‌న్న‌ప్ప సినిమా చేయాల‌నే క‌ల ఇవాల్టి విడుద‌ల‌తో తీరింద‌ని చెప్పాడు మంచు విష్ణు.

నా హృద‌యంతో పాటు మ‌న‌సు కూడా ఈ సినిమా కోసం పెట్టి ప‌నిచేశాన‌ని చెప్పాడు. ఇదిలా ఉండ‌గా క‌న్న‌ప్ప సినిమా కోసం రూ. 200 కోట్లకు పైగా ఖ‌ర్చు చేశారు మంచు మోహ‌న్ బాబు. త‌న లైఫ్ లో అతి భారీ బ‌డ్జెట్ కావ‌డం విశేషం. ఈవెంట్స్ ను కూడా పెద్ద ఎత్తున నిర్వ‌హించాడు.

Also Read : Hero Naveen Chandra – Show Time : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో షో టైం

Exit mobile version