Hero Dhanush – Kriti Sanon : ధ‌నుష్ తో తెర పంచుకోవ‌డం అద్భుతం

కితాబు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Hello Telugu - Hero Dhanush - Kriti Sanon

Hello Telugu - Hero Dhanush - Kriti Sanon

Dhanush : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కృతి స‌న‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) అద్భుత‌మైన న‌టుడంటూ కితాబు ఇచ్చింది. త‌న‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం మ‌రింత ఆనందాన్ని క‌లిగించేలా చేసింద‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఈ ఇద్ద‌రు కలిసి తేరే ఇష్క్ మే మూవీలో న‌టించారు. ఈ సినిమా షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యింది. దీనిని పుర‌స్క‌రించుకుని కృతి స‌న‌న్ మీడియాతో ముచ్చ‌టించింది. త‌ను అనుకోలేద‌ని ఇంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్త‌వుతుందంటూ పేర్కొంది.

Kriti Sanon Praises Dhanush

ఆనంద్ రాయ్ తేరే ఇష్క్ మే మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌ను గ‌తంలో ధ‌నుష్ తో రామ్ జానే తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. పూర్తిగా ప్రేమ‌ను ఆధారంగా తీసుకుని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. తాజ‌గా త‌ను తీసిన ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పూర్తిగా డ్రామా, ఫ్యామిలీ, రొమాన్స్ ను క‌థాంశంగా తీసుకున్న‌ట్లు స‌మాచారం. భావోద్వేగాల‌ను తెర‌పై అద్భుతంగా వ‌చ్చేలా చేశాడంటూ ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించింది ల‌వ్లీ బ్యూటీ కృతీ స‌న‌న్.

త‌న సినీ కెరీర్ లో తేరే ఇష్క్ మే సినిమా క‌ల‌కాలం గుర్తుండి పోతుంద‌ని తెలిపింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది అంద‌మైన ప్ర‌యాణం, ఊహించ‌ని జ్ఞాప‌కంగా త‌న‌ను వెంటాడుతూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది కృతీ స‌న‌న్. ధ‌నుష్ తో పాటు ద‌ర్శ‌కుడితో చేసిన ఈ వ‌ర్క్ త‌న‌కు అంతులేని సంతోషాన్ని ఇచ్చింద‌ని పేర్కొంది.

Also Read : Hero Nithin Reddy – Tammudu Movie : నితిన్ రెడ్డి ట్రైల‌ర్ మూవీ రిలీజ్

Exit mobile version