Beauty Lavanya Tripathi : షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘సతీ లీలావతి’

మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు...

Hello Telugu - Beauty Lavanya Tripathi

Hello Telugu - Beauty Lavanya Tripathi

Lavanya Tripathi : ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి వివాహనంతరం కమిట్ అయిన సినిమా ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో నాగ మోహన్ నిర్మిస్తున్న ఈ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ ప్రెజెంట్ చేస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

Lavanya Tripathi Movie ‘Sathi Leelavathi’ Updates

ఇవాళ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి రానురాను బలహీన పడుతున్నాయి. భార్యాభర్తల బంధం కూడా మూడునాళ్ళ ముచ్చటగా మారిపోయింది. చిన్న చిన్న విషయాలనే బూతద్దంలో చూస్తూ… ఇగోకు పోయి భార్యాభర్తలు విడాకుల వరకూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళను కూర్చోపెట్టి సమస్యలను పరిష్కరించే తీరిక కూడా కుటుంబ సభ్యులకు ఉండటంలేదు. కొత్తగా పెళ్ళైన వైఫ్ అండ్ హజ్బెండ్ కు సంబంధించిన కథను సత్య ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi) లో డీల్ చేసినట్టు ఈ మూవీ ఫస్ట్ లుక్ వీడియో చూస్తే అర్థమౌతోంది. భార్య భర్తలు ఒకరి మాట ఒకరు ఓపికగా విన్నప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈ సున్నితమైన అంశాన్ని వినోదాత్మకగా సత్య చెప్పబోతున్నారు.

గతంలో తాతినేని సత్య ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్.’ చిత్రాలను రూపొందించారు. ఇవి రెండు కూడా తమిళ రీమేక్స్. దర్శకుడిగా అతనికి ఆ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ‘సతీ లీలావతి’ మూవీ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీనికి బీనేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు సంభాషణలు రాశాడు. అతి త్వరలోనే ఈ సినిమాను జనం ముందుకు తీసుకు వస్తామని నిర్మాత నాగ మోహన్ చెబుతున్నారు.

Also Read : Hero Mohanlal : శ్రీలంక పర్యటన నాకు మర్చిపోలేని అనుభూతి

Exit mobile version