Beauty Malavika Mohanan : ప్రభాస్ ని మొదటిసారి కలిసిన సందర్భం నాకొక స్పెషల్ మూమెంట్

ఈ నేపథ్యంలో ఆమె తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు...

Hello Telugu - Beauty Malavika Mohanan

Hello Telugu - Beauty Malavika Mohanan

Malavika Mohanan : మాళవిక మోహనన్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. తరచూ “ASK ME ” అంటూ తన అభిమానులతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉంటారు. ఇటీవల ఆమె రెండు సినిమాల షూటింగ్‌ను పూర్తిచేసి ప్రమోషన్లకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా జరిగిన చాట్‌లో మాళవిక (Malavika Mohanan), తనకు దర్శకుడు రాజమౌళి సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని తెలిపారు. ఆయన దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘పేట’ సినిమా తన నటనా ప్రస్థానంలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందన్నారు.

Malavika Mohanan Comments

ఈ సందర్భంగా ఒక అభిమాని సరదాగా “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని ప్రశ్నించాడు. దానికి మాళవిక వినోదాత్మకంగా స్పందిస్తూ, “నాకు దెయ్యాలంటే భయం” అని చెప్పింది. ఈ వ్యాఖ్య వెనుక కారణం ఏమిటంటే, ఆ అభిమాని ఖాతా పేరు “ఘోస్ట్”గా ఉండటమే.

ఇంకా ది రాజా సాబ్ అనే చిత్రంపై మాట్లాడుతూ, “ఈ సినిమాలో నా పాత్ర భిన్నంగా ఉంటుంది. అందులో ఆకర్షణీయత ఉంటుంది. మాస్ పాట కూడా ఉంటుంది. నేను త్వరలో ప్రమోషన్లలో పాల్గొంటాను,” అని చెప్పారు. అలాగే మోహన్‌లాల్‌తో కలిసి నటించిన హృదయపూర్వం గురించి మాట్లాడుతూ – “మోహన్‌లాల్‌ గారి సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి నటించడం నిజంగా నాకు గౌరవంగా భావిస్తున్నాను,” అని అన్నారు.

తనకు నటన కాక మరో రంగాన్ని ఎంచుకోవాల్సి వస్తే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీని ఎంచుకుంటానన్నారు.

ఇక ది రాజా సాబ్ చిత్ర టీజర్‌కు వచ్చిన స్పందన గురించి మాళవిక మాట్లాడుతూ – “ఈ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. చాలా సంతోషంగా ఉంది,” అని పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్‌ను తొలిసారి షూటింగ్‌లో కలిసిన సందర్భం తన జీవితంలో ప్రత్యేకమైన విష్యం అని చెప్పారు. ప్రభాస్‌ (Prabhas) ఎంతో మర్యాదగా, మిత్రంగా మెలుగుతారని తెలిపారు.

ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబర్ 5న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.

Also Read : Popular Actor Mammootty : మమ్ముట్టి ఆరోగ్యం పై వస్తున్న రూమర్స్ ని ఖండించిన ఎంపీ జాన్

Exit mobile version