Malavika Mohanan : ప్రముఖ నటి మాళవిక మోహన్ కు అరుదైన పురస్కారం లభించింది. అందంతో పాటు అభినయంలో కూడా తనదైన ప్రత్యేకత కలిగిన ఈ నటికి స్టన్నింగ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. తన సినీ కెరీర్ లో ఇది మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోతుందని పేర్కొంది ఈ సందర్బంగా నటి. తాజాగా ముంబై నగరంలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డుల ప్రధానోత్సవంలో తను ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈ సంస్థ ఓటీటీ, వెబ్ సీరీస్ లోను రూపొందిస్తోంది. మాళివక మోహన్ (Malavika Mohanan) కు రెడ్ కార్పెట్ పరిచారు.
Malavika Mohanan Award
ఇదిలా ఉండగా గతంలో తను దళపతి విజయ్ తో కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సూపర్ సక్సెస్ అయిన మాస్టర్ మూవీతో యువత హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత పలు చిత్రాలలో మెరిసింది. మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు పలు ఈవెంట్లలో తళుక్కున మెరిసింది. ఇదే సమయంలో ఊహించని విధంగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన తెరను పంచుకుంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం రాజా సాబ్ లో హీరోయిన్ గా కీ రోల్ పోషిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు దర్శకుడు.
Also Read : Hero Arjun Ambati : జూలై 11న పరమపద సోపానం రిలీజ్
