Manchu Vishnu- Hero Prabhas : డార్లింగ్ ప్రభాస్ వెనుక కర్ణుడిలా ఉండిపోతా..

తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిసీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు భావోద్వేగంగా స్పందించారు...

Hello Telugu - Manchu Vishnu - Hero Prabhas

Hello Telugu - Manchu Vishnu - Hero Prabhas

Manchu Vishnu : శివుడి కృప వల్లే ‘కన్నప్ప’ సినిమాను తెరకెక్కించగలిగామని హీరో మంచు విష్ణు పేర్కొన్నారు. ఆయనే టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీలో ప్యాన్ ఇండియా స్థాయిలో పేరుగాంచిన తారాగణం కలిసి పనిచేయడం విశేషం. ప్రభాస్ (Prabhas) , మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Manchu Vishnu Praises Prabhas

బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మంచి స్పందన అందుకున్న నేపథ్యంలో, సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిసీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు (Manchu Vishnu) భావోద్వేగంగా స్పందించారు.

“ఇది నా సినిమా కాదు, శివుని సినిమా”

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ – “శివానుగ్రహంతోనే ఈ సినిమా జరుగుతోంది. ఇది విష్ణు సినిమా కాదు, కన్నప్ప సినిమా. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ మేమే చేశామా అనిపిస్తుంది. నేను ఇందులో నటించానా అని ఆశ్చర్యమేస్తోంది. చెప్పలేని బాధలు, అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ శివుడి అనుమతితోనే అన్నీ అధిగమించాం” అన్నారు.

శివరాజ్ కుమార్ తనను “ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు?” అని అడిగినప్పుడు,
“ఈ తరం పిల్లలకు కన్నప్ప గొప్పతనం, వాయులింగ మహిమ, శ్రీకాళహస్తి విశిష్టతను తెలిపే బాధ్యతతోనే చేస్తున్నానని చెప్పాను” అని తెలిపారు.

ప్రభాస్‌కి విష్ణు కృతజ్ఞతలు “నా జీవితంలో ప్రభాస్‌ అంటే కృష్ణుడు లాంటి వాడు. నేను ఎక్కడైనా కష్టంలో ఉంటే కర్ణుడిలా నాతో ఉన్నాడు. ప్రభాస్‌ ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నాన్నగారు (మోహన్ బాబు)పై ఉన్న ప్రేమతో, గౌరవంతో ఈ పాత్రకు ఒప్పుకున్నారు. ఈరోజు ప్రభాస్ ప్రపంచ స్టార్ అయినా, మేమిద్దరం మొదట కలిసినప్పటి స్నేహం ఇప్పటికీ అలాగే ఉంది” అని అన్నారు.

ఈ చిత్రంలో విష్ణు ‘తిన్నడు’గా, ప్రభాస్ ‘రుద్రుడు’గా కనిపించనుండగా, అక్షయ్ కుమార్ – కాజల్ జంటగా శివ పార్వతుల పాత్రలు పోషిస్తున్నారు.

జూన్ 27 – భారీ స్థాయిలో రిలీజ్ జూన్ 27న విడుదలయ్యే ‘కన్నప్ప’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. విజువల్స్, కథ, నటీనటుల ప్రతిష్టతో సినిమా ప్రేక్షకులను ఓ పౌరాణిక లోకంలోకి తీసుకెళ్లే విధంగా ఉండబోతుందని చిత్రబృందం తెలిపింది.
“ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని మంచు విష్ణు తెలిపారు.

Also Read : Ahmedabad Plane Crash Shocking : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రముఖ గుజరాతీ దర్శకుడు మృతి

Exit mobile version