Mirapakay : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్యన కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో విడుదలై సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుని కాసులు కురిపించిన చిత్రాలు తిరిగి రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు నటించిన దూకుడుతో పాటు ఖలేజా కూడా విడుదలైంది. గతంలో కంటే ఈసారి ఎక్కువ డబ్బులు రావడంతో సినీ వర్గాలు విస్తుపోయాయి. తాజాగా మాస్ మహారాజా నటించి మెప్పించిన చిత్రం మిరపకాయ్ (Mirapakay). దీనికి దమ్మున్న దర్శకుడు హరీశ్ శంకర్ తీశాడు. రవితేజను కొత్త యాంగిల్ లో చూపించాడు. ఇక డైలాగులు, సాంగ్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
Mirapakay Movie Re-Release Updates
సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే రమేష్ రెడ్డి, ఎ. దీపక్ రాజ్ నిర్వహించగా సంభాషణలు హరీశ్ శంకర్ రాశాడు. రమేష్ పుప్పాల నిర్మించాడు. ఇందులో రవితేజతో పాటు అందాల ముద్దుగుమ్మలు రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్, ప్రకాశ్ రాజ్ కీ రోల్స్ పోషించారు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కాగా, గౌతమ్ రాజు ఎడిట్ చేశాడు. మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ మిరపకాయ్ సినిమాకు సంగీతం అందించాడు.
ఎల్లో ఫ్లవర్స్ కంపెనీ నిర్మించగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ పంపిణీ చేసింది సినిమాను. 2011 జనవరి 13వ తేదీన విడుదలైంది. సినిమా నిడివి మొత్తం 160 నిమిషాలు. బాక్సాఫీస్ వద్ద రూ. 17 కోట్లు వసూలు చేసింది. ఇందులో కోట శ్రీనివాస రావుతో పాటు కొణిదల నాగబాబు సహాయక పాత్రల్లో నటించారు. సంక్రాంతి సందర్బంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫుల్ కాసులు కురిపించింది.
Also Read : Malavika Mohanan Best Award : మాలీవుడ్ నటి మాళవికకు అరుదైన అవార్డు
