Kannappa : ఎల్లప్పుడూ విమర్శలతో హోరెత్తించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంచు మోహన్ బాబు సమర్పించిన మంచు విష్ణు నటించిన ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ఈనెల 27న విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇందులో మంచు విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ తరుణంలో పలువురు సినీ ప్రముఖులు సైతం కన్నప్ప చిత్రం బాగుందంటూ పేర్కొన్నారు.
Kannappa – RGV Interesting Comments
ఇదిలా ఉండగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్నప్ప చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఈ చిత్రాన్ని మాస్టర్ క్లాస్ అంటూ పేర్కొన్నారు. తన కాలేజీ రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. మంచు తిన్నడు (కన్నప్ప) పాత్రను ఆలయం లాంటి విశ్వాసం, క్రూరత్వంతో చిత్రీకరించినందుకు ప్రశంసించాడు దర్శకుడు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే క్లైమాక్స్ సూపర్ గా ఉందంటూ తెలిపాడు.
కన్నప్ప శివలింగం నుండి రక్తస్రావం ఆపడానికి తన కళ్లను అందిస్తాడు. మంచు విష్ణు నటనను కొత్త ఎత్తులకు పెంచిన హృదయ విదారక సన్నివేశం బాగుందన్నాడు. మంచు గురించి ప్రత్యేకంగా కీలక కామెంట్స్ చేశారు ఆర్జీవీ. నువ్వు నన్ను ప్రేమించేలా చేసినందుకు సంతోషంగా ఉన్నానని అన్నారు. దీనిని మాస్టర్ క్లాస్ గా పేర్కొంటూనే భక్తి పెయింటింగ్ తో వేదనతో కూడిన కాన్వాస్ అని పేర్కొన్నాడు.
Also Read : Kannappa Success – Mohan Babu : కన్నప్ప విజయం మోహన్ బాబు సంతోషం
